నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, యామీ గౌతమ్.. ఉత్తమ తెలుగు చిత్రం - కమిటీ కుర్రోళ్లు

జాతీయ ఉత్తమ అవార్డులు, 2024, సినిమాలు

ఫొటో సోర్స్, Facebook

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శనివారం న్యూదిల్లీలో ప్రకటించింది.

ఈసారి ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు ప్రముఖ నటులు పంచుకున్నారు.

'భ్రమయుగం' చిత్రంలో నటనకు గానూ మలయాళ నటుడు మమ్ముట్టి, 'చందూ ఛాంపియన్' సినిమాలో నటనకు గానూ బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌‌‌ను ఈ అవార్డు సం వరించింది.

ఉత్తమ నటిగా యామి గౌతమ్ (ఆర్టికల్ 370) ఎంపికయ్యారు.

ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియాసామి (అమరన్) ఎంపికయ్యారు.

కమిటీ కుర్రోళ్లు

ఫొటో సోర్స్, Twitter@PinkElephant_P

ఉత్తమ తెలుగు చిత్రం : కమిటీ కుర్రోళ్లు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారాల్లో 2024 సంవత్సరానికి గానూ మొత్తం 400లకు పైగా చిత్రాలు జ్యూరీ ముందుకు రాగా, వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటిని ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది.

ఈసారి జాతీయ అవార్డులలో తెలుగు చిత్ర పరిశ్రమ పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.

'35 ఇది చిన్న కథ కాదు' ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికవగా, అందులో నటించిన బాల నటుడు అరుణ్‌దేవ్‌కు ఉత్తమ బాలనటుడు అవార్డు దక్కింది.

'కమిటీ కుర్రోళ్లు' ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడమే కాకుండా, ఈ చిత్రానికి పి. రవికుమార్‌కు ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు లభించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు సినిమాలకు అవార్డులు, 35 చిన్న కథ కాదు

ఫొటో సోర్స్, Facebook/Sureshproductions

ఫొటో క్యాప్షన్, '35 ఇది చిన్న కథ కాదు' జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది.

'కల్కి 2898 ఏడీ' ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైంది. దీంతో పాటు ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (నితిన్ జిహానీ చౌదరి) అవార్డును కూడా గెలుచుకుంది.

'పుష్ప 2' చిత్రం కోసం దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్(ఒరిజినల్) అవార్డు గెలుచుకోగా , ఇదే చిత్రానికి దీపాలి నూర్, శీతల్ శర్మలకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా అవార్డు దక్కింది.

దుల్కర్ సల్మాన్ నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రానికి గాను వెంకీ అట్లూరి ఉత్తమ సంభాషణల రచయితగా అవార్డును గెలుచుకున్నారు.

అమరన్, జాతీయ అవార్డులు

ఫొటో సోర్స్, FB/iKamalHaasan

జాతీయ అవార్డుల విజేతలు వీరే..

ఉత్తమ నటులు: మమ్ముట్టి (భ్రమయుగం), కార్తీక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్)

ఉత్తమ నటి: యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)

ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370

ఉత్తమ దర్శకత్వం: అమరన్ (రాజ్‌కుమార్ పెరియాసామి)

ఉత్తమ సహాయ నటి: మిథ్య (రూపశ్రీ వర్కాడే)

ఉత్తమ సహాయ నటి: సచన నమిదాస్ (మహారాజ)

ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా (భక్షక్)

ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు (దర్శకుడు-నంద కిషోర్)

ఉత్తమ జాతీయ, విలువల చిత్రం: కెప్టెన్ మిల్లర్ (దర్శకుడు- అరుణ్ మాధేశ్వరన్)

ఉత్తమ ప్రజాదరణ చిత్రం: కల్కి 2898 ఏడీ (దర్శకుడు-నాగ్ అశ్విన్)

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: రణ్‌దీప్ హుడా (స్వాతంత్య్ర వీర్ సావర్కర్)

ఉత్తమ యాక్షన్: మహారాజ (తమిళ్)

ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్ గంగూలీ (ఆజ్ కిరాత్ -స్త్రీ2)

ఉత్తమ గేయరచన: మనోజ్ ముంతాషిర్ (జానేదో-మైదాన్)

ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాష్ కుమార్ (అమరన్)

ఉత్తమ సంగీతం (పాటలు): శశ్వంత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)

ఉత్తమ మేకప్: పి. రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప-2)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ ఎడిటింగ్: ఆర్ కలైవానన్ (అమరన్)

ఉత్తమ సౌండ్ డిజైన్: మానస్ చౌదరి (భూల్ భులయ్య 3-హిందీ)

ఉత్తమ స్క్రీన్‌ప్లే (సంభాషణలు): వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (అడాప్టెడ్): యోగేశ్ దేశ్‌పాండే (స్వరగంధర్వ సుదిర్ ఫాడ్కే)

ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (ఒరిజినల్): సుకుమార్ (పుష్ప-2)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: షహనాద్ జలాల్ (భ్రమయుగం)

ఉత్తమ గాయని: వైకోమ్ విజయలక్ష్మి (ఏఆర్ఎమ్)

ఉత్తమ గాయకుడు: అభయ్ జోధ్ పూర్కర్ (గరాత్ గణపతి)

ఉత్తమ బాల నటులు: రిద్ధిమాన్ బెనర్జీ, తపోమయ్ దేవ్, గీతాశ్రీ చక్రవర్తి (అంకో కి కితిన్ -బెంగాలీ)

ఉత్తమ బాల నటుడు: అరుణ్‌దేవ్ పోతుల (35 - చిన్న కథ కాదు)

ఉత్తమ బాల నటుడు: అతీశ్ శెట్టి

స్పెషల్ మెన్షన్: మెయ్యజగన్-తమిళ్ (ఫిల్మ్ సౌండ్ మిక్స్ ఇంజినీర్: సురేన్ జి)

స్పెషల్ మెన్షన్: కెప్టెన్ మిల్లర్ (తమిళ్): ధనుష్

ప్రాంతీయ చిత్రాల విభాగంలో జాతీయ అవార్డుల జాబితా:

ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రోళ్లు

ఉత్తమ తమిళ్ చిత్రం: రాయన్

ఉత్తమ మలయాళం చిత్రం: ఫెమినిచ్చి ఫాతిమా

ఉత్తమ ఒడియా చిత్రం: లహరి

ఉత్తమ మరాఠీ చిత్రం: ముక్కామ్ పోస్ట్ బొంబిల్ వాడి

ఉత్తమ తుళు చిత్రం: ఇంబు

ఉత్తమ గర్వాలీ చిత్రం: ధోలి

ఉత్తమ మణిపురి చిత్రం: సునిత

ఉత్తమ కొంకణి చిత్రం: మోగ్ ఆసుమ్

ఉత్తమ కన్నడ చిత్రం: మిథియా

ఉత్తమ హిందీ చిత్రం: శ్రీకాంత్

ఉత్తమ గుజరాతీ చిత్రం: మారన్

ఉత్తమ బెంగాలీ చిత్రం: చలిచిత్ర ఎకోన్

ఉత్తమ అస్సామీ చిత్రం: జుయిఫిల్మ్ (ఆరెంజ్ అండ్ పర్పుల్)

వీటితో పాటు ఆయా సినిమాలకు వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)