ఉస్మానియా హాస్పిటల్‌ పాత భవనాన్ని తక్షణం ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఆదేశం

ప్రచురణ

''ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు తెలంగాణ పేదలకు తల్లిదండ్రులు"- హైదరాబాద్‌లోని ఈ వైద్యశాలల ఖ్యాతి తెలిసిన వారనే మాట ఇది.

ఇటీవల వర్షాలకు ఉస్మానియా దవాఖానాలోకి నీళ్లు వచ్చాయి. పేషెంట్లు పడుకున్న వార్డుల్లో కూడా నీళ్లు నిలిచాయి. వాననీరే కాకుండా డ్రైనేజీ నీరూ అక్కడ చేరింది. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.

కాగా, ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని ఖాళీ చేయాలని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ భవనంలో ఉన్న పేషెంట్లను కూడా మిగతా భవనాలకు మార్చాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

ఒకటిన్నర శతాబ్దం చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి ఈ గతి పట్టడానికి కారణం ఎవరు? వివాదాస్పద చారిత్రక భవనాన్ని అలా వదిలేసి, పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొత్త భవనాలను ఎందుకు నిర్మించలేదు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)