You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించిన పోలీసులు, ఆయన భార్య ఏమన్నారంటే..
నీట్ సహా పరీక్ష పత్రాల లీకేజీకి నిరసనగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను దిల్లీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
గ్యారీ సోబర్స్: 12 వేళ్లు, ఒకే ఓవర్లో 6 సిక్సులు, 365 పరుగుల రికార్డ్ ఇన్నింగ్స్, భారతీయ నటితో నిశ్చితార్థం.. ఈ క్రికెట్ దిగ్గజం జీవితంలో ఎన్నో విశేషాలు
"ఆ సమయంలో నా కెరీర్ అత్యుత్తమ స్థాయిలో ఉంది. భారత్‌లో క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ల వివాహం అనే ఒక ఉదాహరణ అందరిముందుంది. పెళ్లి కోసం నేను అంజూను లండన్ తీసుకెళ్లాలనుకున్నాను. కానీ, కొన్ని సమస్యలు తలెత్తాయి. ఆమె నాతో పాటు ఇంగ్లండ్ రాలేకపోయింది."
పొట్టి శ్రీరాములు 'ఆమరణ నిరాహార దీక్ష' భారత దేశ చిత్రపటాన్నే మార్చేసింది.. ఇది ఇప్పటికీ రాజకీయాలను మార్చగలదా?
ఒక వ్యక్తి ఖాళీ కడుపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు చిత్రపటాన్ని మార్చేసింది."దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై పొట్టి శ్రీరాములు ప్రభావం సామాన్యమైనది కాదు" అని చరిత్రకారుడు రామచంద్ర గుహ రాశారు. మరి, అలాంటి ఉపవాస దీక్షలకు ఇప్పటికీ అంత శక్తి ఉందా?
ఏపీలో కోవిడ్ కలవరం: 12 కేసులు.. నలుగురు మృతి.. ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందా?
కోవిడ్ సోకిన వారిలో నలుగురు మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కానీ, ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ తెలిపారు. వైద్యులు, ఆసుపత్రులు, సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేశామని ఆయన పేర్కొన్నారు.
విక్రమ్ -1 : ప్రయోగానికి సిద్ధమైన భారత ‘తొలి ప్రైవేటు ఆర్బిటాల్ రాకెట్’.. దీని ప్రత్యేకతలేమిటి?
''ఈ రాకెట్ 40 టన్నుల బరువు, 20 మీటర్ల ఎత్తు (సుమారు ఏడు అంతస్తుల భవనమంత) ఉంటుంది. దీనికి సెకనుకు 8 కిలోమీటర్ల వెలాసిటీతో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే సామర్థ్యం ఉంది'' అని స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ కో-ఫౌండర్ పవన్ కుమార్ తెలిపారు.ఇది భారత తొలి వాణిజ్య లాంచ్ వెహికల్ అని చెప్పారు.
మూవీ రివ్యూ: 'ఓ సుకుమారి' ఎలా ఉంది.. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ నటన ఆకట్టుకుందా?
పక్క ఊరిలో ఉన్న దామినిని చూసి యాదగిరి ఇష్టపడతాడు. కానీ ఆమెకున్న విచిత్రమైన సమస్యను దాచిపెట్టి పెళ్లి జరిపిస్తారు. మరి పెళ్లి తరువాత యాదగిరి (తిరువీర్) ఎదుర్కొన్న తిప్పలు ఏమిటి? ఈ గ్రామీణ నేపథ్య హాస్య చిత్రం ఆకట్టుకునేలా ఉందా?
డీఆర్ కాంగో: చెట్ల చిటారు కొమ్మన రహస్యంగా జీవించే కొత్త కోతి జాతిని కనుగొన్న పరిశోధకులు
కాంగో మధ్య- తూర్పు ప్రాంతంలోని ఉష్ణమండల అడవుల్లోని లోమామి నేషనల్ పార్క్‌లో ఎత్తైన చెట్ల దట్టమైన ఆకుల మధ్య దాక్కుని ఉన్న ఈ నల్లని రోమాలు గల వానరాన్ని పరిశోధకులు గుర్తించి చిత్రీకరించారు. ఈ అసాధారణ రూపం కలిగిన కోతిని తొలిసారి 2008లో చూసినట్టు అక్కడ పనిచేస్తున్నవారు చెప్పారు.
యుక్రెయిన్: జెలియెన్‌స్కీకి వ్యతిరేకంగా సొంతదేశంలో ఆందోళనలు.. రక్షణ మంత్రి తొలగింపుపై ప్రజల్లో ఆగ్రహం
యుక్రెయిన్ రక్షణ మంత్రి మైఖైలో ఫెదొరోవ్‌ను మార్చాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలియెన్‌స్కీ ఆకస్మికంగా నిర్ణయించడంపై అక్కడి పౌర సమాజం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జెలియన్‌స్కీ చర్యకు వ్యతిరేకంగా ఎంపీలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
‘మిస్టర్ మిడిల్‌క్లాస్’ మూవీ రివ్యూ: అంతా మంచి నటులే, మరి.. ప్రేక్షకుల సహనానికి ఎందుకింత పరీక్ష?
దేవుడు, మనిషికి మధ్య సంఘర్షణ చాలా పాత పాయింట్, సరిగా తీస్తే ఎపుడూ కొత్తగానే వుంటుంది. కష్టాల్లో ఉన్నపుడు దేవుడి సాయం కోరడం మనిషి స్వభావం. నిజంగా దేవుడు దిగి వస్తే ఏం జరుగుతుందనేది మంచి కాన్సెఫ్ట్.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.