ఉస్మానియా హాస్పిటల్ పాత భవనాన్ని తక్షణం ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఆదేశం
''ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు తెలంగాణ పేదలకు తల్లిదండ్రులు"- హైదరాబాద్‌లోని ఈ వైద్యశాలల ఖ్యాతి తెలిసిన వారనే మాట ఇది.
ఇటీవల వర్షాలకు ఉస్మానియా దవాఖానాలోకి నీళ్లు వచ్చాయి. పేషెంట్లు పడుకున్న వార్డుల్లో కూడా నీళ్లు నిలిచాయి. వాననీరే కాకుండా డ్రైనేజీ నీరూ అక్కడ చేరింది. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.

కాగా, ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని ఖాళీ చేయాలని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ భవనంలో ఉన్న పేషెంట్లను కూడా మిగతా భవనాలకు మార్చాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
ఒకటిన్నర శతాబ్దం చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి ఈ గతి పట్టడానికి కారణం ఎవరు? వివాదాస్పద చారిత్రక భవనాన్ని అలా వదిలేసి, పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొత్త భవనాలను ఎందుకు నిర్మించలేదు?
ఇవి కూడా చదవండి:
- ఈ 'డ్రాకులా' రక్తం తాగడు... శత్రువులను ఈటెలకు గుచ్చి కాకులు, గద్దలకు వదిలేసేవాడు
- చోరీకి గురైన నిజాం బంగారు టిఫిన్ బాక్సు దొరికింది : ‘ఆ మ్యూజియంలో రూ. 400 కోట్ల విలువైన కళాఖండాలు’
- కరోనావైరస్: తెలంగాణ ఆస్పత్రుల్లో తగినన్ని బెడ్స్ ఉన్నాయా? అనుమానాలు ఎందుకు?
- హైదరాబాద్: నిజాం పాలకుల క్వారంటైన్ హాస్పిటల్... ఇప్పుడు కోరంటి దవాఖానా
- పాకిస్తాన్లో మిలటరీ అరాచకాలను ప్రశ్నించే జర్నలిస్ట్ కిడ్నాప్
- చైనా - అమెరికా గొడవల్లో టిక్‌టాక్ ఎలా చిక్కుకుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)