BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
యుక్రెయిన్: జెలియెన్‌స్కీకి వ్యతిరేకంగా సొంతదేశంలో ఆందోళనలు.. రక్షణ మంత్రి తొలగింపుపై ప్రజల్లో ఆగ్రహం
యుక్రెయిన్ రక్షణ మంత్రి మైఖైలో ఫెదొరోవ్‌ను మార్చాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలియెన్‌స్కీ ఆకస్మికంగా నిర్ణయించడంపై అక్కడి పౌర సమాజం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జెలియన్‌స్కీ చర్యకు వ్యతిరేకంగా ఎంపీలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
ఆర్జ్‌మోన్ మెక్సికానా: ‘ఆరుగురి మరణానికి కారణమైన’ ఈ మొక్క ఏమిటి? 200 లీటర్ల వంట నూనెలో ఈ గింజల నూనె రెండు చుక్కలు కలిసినా ప్రాణాలు పోతాయా?
ఝార్ఖండ్‌లోని పలామూ జిల్లా సిక్కా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ‘ఎపిడమిక్ డ్రాప్సీ’ అనే అనారోగ్య పరిస్థితి కారణంగా మరణించారు. పలామూ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ శ్రీవాస్తవ ఈ మరణాలకు కారణాన్ని వివరించారు. ‘ఆర్జ్‌మోన్ మెక్సికానా' కలిసిన ఆవనూనె వాడడం వల్ల ఎపిడమిక్ డ్రాప్సీతో వారంతా మరణించారు" అని ఆయన అన్నారు.
టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటే యుద్ధానికి పనికిరారా?
''యువకులు టెస్టోస్టిరాన్ తీసుకుంటే అది వారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయొచ్చు. పిల్లలను కనాలనుకునేవయసులో ఉన్నవారికి ఈ విషయం ముందుగానే తెలియజేయాలి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా కొంత పెంచే అవకాశం ఉంది'' అని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసన్‌లో యూరాలజీ ప్రొఫెసర్ ఖేరా చెప్పారు.
పార్లమెంట్ సీట్ల పెంపు: వర్షాకాల సమావేశాలలో బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా.. మారుతున్న సమీకరణలు ఏం చెబుతున్నాయి
వర్షాకాల సమావేశాలకు ముందు, రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేయడానికి మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించేందుకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
గూగుల్ డేటా సెంటర్‌ను మూడు ప్రాజెక్టులుగా ఎందుకు చూపించారు? పర్యావరణ అనుమతులు అంత వేగంగా ఎలా వచ్చాయి?
బీబీసీ బృందం విశాఖ జిల్లాలోని తర్లువాడ, అడవివరం, అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి ప్రాంతాలను సందర్శించింది. ఈ మూడు ప్రాంతాల్లో ప్రస్తుతం భూమి చదును, మట్టి తరలింపు వంటి పనులు కొనసాగుతున్నాయి.
ఛాతీలో నొప్పి.. గ్యాస్ట్రిక్ సమస్యా, గుండెపోటా?
ఛాతీలో నొప్పి అనేది శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక సంకేతం. అది గ్యాస్ట్రిక్ సమస్య కావచ్చు, కండరాల నొప్పి కావచ్చు, లేదా గుండెపోటుకు తొలి సూచన కూడా కావచ్చు. అందువల్ల సొంత నిర్ణయాలతో చికిత్స ఆలస్యం చేయడం ప్రమాదకరం. సమయానికి ఆసుపత్రికి చేరుకోవడం, సరైన పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన చికిత్స తీసుకోవడం వల్ల చాలా అవసరం.
సోనమ్ వాంగ్‌చుక్ : 'దీక్ష విరమణకు నాపై ఒత్తిడి తేకండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి’
''నన్ను ఒత్తిడి చేస్తే ఏమవుతుంది. నేను దీక్షను విరమిస్తే దేశానికి ఎలాంటి సందేశం వెళ్తుంది? ఎలాంటి జవాబుదారీతనం అవసరం లేదని ప్రభుత్వం భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి నాపై ఒత్తిడి తేవడం ఆపి, ఇప్పటి వరకు మన డిమాండ్లపై స్పందించని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి'' అని సోనమ్ అన్నారు.
లిల్లీ పాడింగ్ : ఉన్న ఉద్యోగంలో ఉండనివ్వని ఈ ధోరణి ఏమిటి? ఇందులో జెన్ జెడ్ ముందంజలో ఉందా?
ఒకే కంపెనీలో, ఒకే ఉద్యోగంలో కొనసాగడం కంటే తరచూ ఉద్యోగాలు మారుతూ కొత్త నైపుణ్యాలు సంపాదించుకోవడం, మరింత ఉన్నతస్థాయి ఉద్యోగాలు, మెరుగైన వేతనం పొందే అవకాశాలను పెంచుకోవడాన్ని ఈ ధోరణి సూచిస్తుంది. దీని ద్వారా ఉద్యోగ విపణిలో తమ విలువను మరింత పెంచుకోవచ్చన్నది దీని వెనుక ఉన్న ఆలోచన.
‘సల్వార్‌ను విప్పడానికి ప్రయత్నించడం’ అత్యాచార యత్నం కాదన్న పట్నా హైకోర్టు, ఇలాంటి తీర్పులు ఎందుకు వస్తున్నాయి?
"సల్వార్ విప్పేందుకు ప్రయత్నించడం అత్యాచార యత్నం కాదని ఏ మహిళా న్యాయమూర్తి అయినా చెప్పగలరా? సమస్య ఏంటంటే మహిళలకు సామర్థ్యం ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థలో వారికి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ఈ తక్కువ ప్రాతినిధ్యం న్యాయవ్యవస్థకే చేటు చేస్తోంది. ఎందుకంటే ఇలాంటి తీర్పులు సాధారణ ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో మొత్తం వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































