అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. విమానం దిగగానే అభిజిత్ ఎలా కనిపించారు, ఏం చెప్పారు?

    Abhijit Dipke

    ఫొటో సోర్స్, PTI

    కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే, దిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న వీడియోను వార్తా సంస్థ పీటీఐ ట్వీట్ చేసింది.

    ‘విద్యా శాఖ మంత్రి కచ్చితంగా రాజీనామా చేయాలి. అయిదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు’ అని అభిజిత్ వ్యాఖ్యానించడం ఆ వీడియోలో చూడొచ్చు.

    డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముఖచిత్రం ఉన్న పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. ఏఐ సాయంతో వ్యాక్సిన్ తయారీ, ఇకపై వైరస్ ‘వేషాల’కు చెక్ పెట్టొచ్చా?

  3. నిరసనకు దిల్లీ పోలీసుల అనుమతి దొరికిందని సీజేపీ ప్రకటన

    ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద పరిస్థితి
    ఫొటో క్యాప్షన్, ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద పరిస్థితి

    జంతర్ మంతర్ వద్ద తాము నిర్వహించబోయే నిరసన ప్రదర్శనకు దిల్లీ పోలీసుల నుంచి అనుమతి లభించిందని కాక్రోచ్ ఈజ్ బ్యాక్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

    ఈ నేపథ్యంలో ముందు ప్రణాళిక ప్రకారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా మద్దతుదారులంతా జంతర్ మంతర్ వద్దకే రావాలని కోరింది.

    అలాగే, 10 గంటల నుంచి శాంతియుత నిరసన మొదలుపెడదామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా ట్వీట్ చేశారు.

    ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద వాతావరణం ఎలా ఉందో కింది ఫోటోల్లో చూడండి.

    ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద పరిస్థితి
    ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద పరిస్థితి
    ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద పరిస్థితి
  4. సీజేపీ ధర్నా: ‘పూలు, పుస్తకాలు, జాతీయజెండా తీసుకురండి’’ అంటూ పిలుపు

    సీజేపీ పార్టీ ప్రతినిధులు

    ఫొటో సోర్స్, x/Cockroachisback

    ఫొటో క్యాప్షన్, సీజేపీ ప్రతినిధులు

    జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయాలని మద్దతుదారులకు సీజేపీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

    తమతో పాటు తిరంగా జెండా, పూలు, పుస్తకాలు తీసుకురావాలని కోరారు. ఎలాంటి హింసకు తావులేకుండా కేవలం శాంతిపూర్వకంగానే నిరసన చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను సాధించుదామని ఎక్స్‌ వేదికగా ఒక వీడియోలో పేర్కొన్నారు.

    మద్దతుదారులు తమతో పాటు తమ తల్లిదండ్రులను కూడా తీసుకురావాలని కోరారు.

    ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే వెంటనే దిల్లీ పోలీస్‌కు రిపోర్ట్ చేయాలని, తమ ఫోన్లను ఆన్‌లో ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.

    ఇవే విషయాలను ప్రస్తావిస్తూ ధ్రువ్ రాఠీ కూడా ఎక్స్‌లో ఒక వీడియో పెట్టారు.

    ధ్రువ్ రాఠీ

    ఫొటో సోర్స్, x/DhruvRathee

    ఫొటో క్యాప్షన్, ధ్రువ్ రాఠీ
  5. సోషల్ మీడియాలో పుట్టి నేడు తొలిసారి వీధుల్లోకి రానున్న కాక్రోచ్ జనతా పార్టీ

    అభిజిత్ దీప్కే

    ఫొటో సోర్స్, X/Cockroachisback

    దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరనస తెలిపేందుకు అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

    కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు సీజేపీ యోచిస్తోంది.

    ఈ మేరకు జూన్ 5న ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ ఎక్స్ హ్యాండిల్‌ ఒక పోస్ట్ చేసింది. అందులో తమ ప్రణాళికను పంచుకుంది.

    ‘‘ఫెలో కాక్రోచెస్.. జూన్ 6న ఉదయం 9 గంటలకు కలుద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా నిరసన చేద్దాం. చిన్న తమాషాను ఉద్యమంగా మార్చే సమయం ఇదే. శాంతియుతంగా నిరసన తెలపడానికి దిల్లీ వీధుల్లోకి వచ్చేయండి. కానీ, అక్కడ ఏం చేయాలో? ఏం చేయకూడదో కూడా గుర్తుపెట్టుకోండి. అందరి కళ్లు మనమీదే’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

  6. రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్: 15 లక్షల కోట్ల ‘నకిలీ ఆదాయం’ చూపిందని సెబీ ఆరోపిస్తున్న కంపెనీలో ఎల్ఐసీ భారీ పెట్టుబడులు ఎందుకు పెట్టింది?

  7. బైక్‌పై వెళ్తుంటే ఏనుగు అడ్డొచ్చి వెంబడించింది.. ఎలా తప్పించుకున్నారంటే

  8. '4 అడుగుల ఇంట్లో 4 తరాలుగా ఉంటున్నాం'

  9. సహారా ఎడారి మధ్యలో చెడిపోయిన లారీ.. నీళ్లు దొరక్క దాహంతో 49 మంది మృతి

  10. తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలకు ఎక్కువ అర్హత ఉన్నవారు ఎంపికైతే.. బ్యాంక్ అటెండెంట్ కేసులో సుప్రీంకోర్ట్ ఏం చెప్పింది?

  11. ‘తెలివైన ఎలుగుబంటి.. ట్యాప్ విప్పి నీరు తాగింది, కిటికీ తీసి పారిపోయింది’

  12. అన్నామలై: ‘రజినీకాంత్ పిలిచినా వెళ్లలేదు.. అవసరమైతే బీజేపీతోనూ విభేదిస్తా’

  13. రేంజ్ యాంగ్జైటీ: ‘చార్జింగ్ సరిపోతుందో లేదో’ - ఈ భయమే ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లకు అడ్డంకిగా ఉందా

  14. నడుము వంగిపోయిన ఈ పెద్దాయనకు జైలుశిక్ష ఎందుకు పడింది?

  15. నీట్ విద్యార్థిని ఆత్మహత్య : ‘‘అమ్మా నాన్నా నన్ను క్షమించండి.. మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు, అంతా అయిపోయింది’’

  16. ఎవరెస్ట్‌‌పైన అద్భుతం: చనిపోయాడనుకున్న గైడ్ 6 రోజుల తరువాత మంచుపై పాకుతూ వచ్చాడు

  17. సార్థక్,వేదాంత్, నిసర్గ్ : ఈ ముగ్గురు టీనేజర్లు ‘ఓఎస్ఎం వివాదం’పై ఏం చేశారు?

  18. ‘భయంకరమైన ఆర్థిక సునామీ రానుంది, ఏడాదిలోగా మోదీ దిగిపోతారు’అంటూ రాజకీయ దుమారం రేపిన రాహుల్‌గాంధీ

  19. కాక్రోచ్ జనతా పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?