ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం.. అర్జెంటీనాపై సౌదీ అరేబియా విజయం
ఫిఫా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అర్జెంటీనా జట్టును 53వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా జట్టు ఓడించి, సంచలన విజయం నమోదు చేసింది
లైవ్ కవరేజీ
జంతర్ మంతర్: వాష్‌రూమ్స్, ఫుడ్, మెడిసిన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నామంటే..
ప్రభుత్వంతో సీజేపీ చర్చలు జరగకపోవడానికి కారణమదేనా?

ఫొటో సోర్స్, ANI
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను గురువారం చర్చలకు ఆహ్వానించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయంలో చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, చర్చల వేదికపై సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అభ్యంతరం వ్యక్తం చేశారు. "చర్చలు తటస్థ ప్రదేశంలో జరగాలి" అని అన్నారు.
జంతర్ మంతర్ వద్ద ఉన్న మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, "జంతర్ మంతర్‌కు రావడానికి వాళ్లు భయపడుతున్నారు. అందుకే, మీ నివాసం లేదా జంతర్ మంతర్ కాకుండా మరోచోట చర్చలు జరగాలని వారికి సూచించాం" అని ఆయన అన్నారు.
"కానీ, జితేంద్ర సింగ్ మాత్రం జేపీ నడ్డా నివాసం లేదా ఆయన కార్యాలయంలో చర్చలు జరుపుదామని అంటున్నారు."
చర్చావేదిక విషయంలో సీజేపీ, ప్రభుత్వానికి మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు పట్టుబడుతున్నారు.
ప్రీటర్మ్ డెలివరీ: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు జీవితాంతం సమస్యలు తప్పవా? అపోహలు - సమాధానాలు
ఎన్ఎస్ఏ కింద దిల్లీ పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన అధికారం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ), 1980 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులను జారీ చేసే అధికారాన్ని దిల్లీ పోలీస్ కమిషనర్‌కు కల్పించారు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.
ఈ అధికారాన్ని 2026 జూలై 19 నుంచి 2026 అక్టోబర్ 18 వరకు మూడు నెలల కాలానికి మంజూరు చేసినప్పటికీ, ఈ విషయం ఇప్పుడే బహిరంగంగా తెలిసింది.
దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం జరుగుతున్న నిరసనల దృష్ట్యా దీన్ని అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.
జూలై 20న జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహించాలని సీజేపీ పిలుపునిచ్చింది.
దీని తర్వాత, నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో చాలా మంది గాయపడ్డారు.
జంతర్ మంతర్ వద్ద సీజేపీ, దాని కార్యకర్తల నిరసన ఇంకా కొనసాగుతోంది.
సీదిరి అప్పలరాజు అరెస్ట్: యాక్సిడెంట్ కేసు నుంచి కొడుకును తప్పించేందుకు ప్రయత్నించారా?
మోదీ కంటే ముందు ప్రధాన మంత్రులు ఎక్కడ నివసించారు? తెలుగుదేశం ఎంపీలు 2013లో అప్పటి ప్రధాని నివాసం సమీపంలో ఎందుకు నిరసన తెలిపారు
దిల్లీలో 16 మెట్రో స్టేషన్ల నుంచి రాకపోకలు బంద్

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో నిరసనల నేపథ్యంలో గురువారం (23.07.2026) కూడా మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. 16 మెట్రో స్టేషన్లను గురువారం ఉదయం 7.30 నుంచి మూసివేస్తున్నామని, తదుపరి సూచనలు వచ్చేవరకు ఈ స్టేషన్ల నుంచి రాకపోకలకు వీలుండదని ‘దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్’ తన ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది.
మూసివేసిన స్టేషన్లు ఇవే..
1) లోక్ కల్యాణ్ మార్గ్
2) రాజీవ్ చౌక్
3) పటేల్ చౌక్
4) రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్
5) బారాఖంభా రోడ్
6) సుప్రీంకోర్ట్
7) సేవా తీర్థ్
8) జన్‌పథ్
9) మండీహౌస్
10) సెంట్రల్ సెక్రటేరియట్
11) ఐటీఓ
12) దిల్లీ గేట్
13) ఇంద్రప్రస్థ
14) ఖాన్ మార్కెట్
15) జోర్ బాగ్
16) శివాజీ స్టేడియం
అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ప్రయాణికులు ఒక లైన్ నుంచి మరొక లైన్‌కు మారే సౌకర్యం ఎప్పటిలా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
కాక్రోచ్ ఉద్యమం: బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు అస్త్రంగా మారనుందా?
ఎవరు ఆర్డర్ పెడుతున్నారో తెలీదు, వందల్లో వస్తున్న ఫుడ్ పార్శిళ్లు... ఎక్కడంటే..
ప్రభుత్వం తీరు నచ్చక మళ్లీ ‘మత్తు మందు’ సాగు మొదలుపెడుతున్న రైతులు
షార్క్స్: వీటికి మ్యాథ్స్ తెలుసు, మ్యూజిక్ అంటే ఇష్టం – సొరచేపల గురించి మీకు తెలియని తొమ్మిది విషయాలు
కాక్రోచ్ జనతా పార్టీ: ‘‘ కేంద్ర మంత్రి ఇంట్లో చర్చలకు ఆహ్వానించారు. కానీ, మేం తిరస్కరించాం’’

ఫొటో సోర్స్, ANI/X
ప్రభుత్వం చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి రావాల్సిందిగా తమకు ఆహ్వానం అందిందనీ, కానీ దాన్ని తిరస్కరించామని కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ విషయంలో ఒక ప్రకటన చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. సౌరవ్ దాస్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘బుధవారం ఉదయం మా దగ్గరికి పోలీసులు వచ్చారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాతో మాట్లాడలనుకుంటున్నారని మాకు చెప్పారు. ఈ చర్చల కోసం మమ్మల్ని ఆయన ఇంటికి ఆహ్వానించారు. అయితే మేం ఆ అభ్యర్థనను తిరస్కరించాం. మేం ఎవరి ఇంటికి, ఆఫీసుకి వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ ఒక జనతా దర్బార్‌ను నిర్వహిస్తున్నాం. ఒకవేళ మంత్రులు మాతో చర్చలు జరపాలనుకుంటే వాళ్లే జనం దగ్గరికి రావాలి. చర్చలు జంతర్ మంతర్ దగ్గరే జరగాలి. ఒకవేళ నిరసన స్థలంలో భద్రతా ఆందోళనకరమని ప్రభుత్వం భావిస్తే, జంతర్ మంతర్ సమీపంలో ఏదైనా ఒక తటస్థ వేదిక దగ్గర చర్చలకు కూడా మేము సిద్ధమే. ఈ విషయమై మేము ప్రభుత్వం నుంచి ,స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’ అని అన్నారు.
తాము ప్రతిపాదించిన డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉండాలనీ, ఎటూ తేలని భేటీలకి తమను పిలవడం వల్ల లాభం లేదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిల్లీ వీధుల్లోకి వచ్చిన యువత మోదీ సర్కారుకు సమస్యలు పెంచుతుందా?
సీజేపీ నిరసనకారులపై దాడుల పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సీజేఐ నిరాకరణ
‘18 నెలలు ప్రయత్నించినా పిల్లలు కలగలేదు’.. మగవాళ్లలో సంతానలేమి సమస్యలను పెద్దగా పట్టించుకోరెందుకు
రాహుల్ గాంధీ ధర్నా: మోదీ ఇంటి నుంచి ఛత్రసాల్ స్టేడియం వరకు.. మంగళవారం రాత్రి ఏం జరిగింది?
ఛత్రసాల్ స్టేడియానికి రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతల తరలింపు, కొందరి విడుదల

ఫొటో సోర్స్, ANI
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు విపక్ష నేతలను పోలీసులు మొదట ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు.
లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసం ముందు వీరంతా ధర్నా చేస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విపక్ష నేతలలో కొందరిని ఈ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఛత్రసాల్ స్టేడియంలో కాసేపు ఉంచిన తర్వాత పోలీసులు రాహుల్ గాంధీని విడిచిపెట్టారు. తర్వాత ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి ఒక వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
విద్యార్థులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తప్పుబట్టారు. "ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను అంగీకరించాలి. విద్యార్థులు, యువతపై ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. వారిని కొట్టారు, తలలు పగలగొట్టారు.. చివరికి విద్యార్థినుల బట్టలు కూడా చింపేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో, ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం నుంచి ఆశించే ప్రవర్తన ఇదేనా? మేం ఈ అంశాన్ని సభలో లేవనెత్తుతాం" అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "మన దేశ భవిష్యత్తైన పిల్లల మాట వినడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? వారి డిమాండ్ చాలా న్యాయమైంది. ప్రజాప్రతినిధులుగా వారి గొంతుకను వినిపించడం, బలోపేతం చేయడం మా బాధ్యత. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రాథమిక హక్కు. ఎక్కడ అవసరమైతే అక్కడ మా గొంతు వినిపిస్తాం. మా డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది. మొదటి నుంచి మేం ఒకే మాటపై ఉన్నాం. కుప్పకూలిన విద్యా వ్యవస్థను సరిచేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరగాలి. విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక బిల్లును ఎందుకు తీసుకురావడం లేదు?" అని తెలిపారు.
"ప్రభుత్వం నిన్న తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. ఈ రోజు కూడా అదే క్రూరత్వాన్ని పునరావృతం చేసింది. వీరు పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకులు. జితేంద్ర సింగ్ మాకు నోటీసు ఇవ్వమని, ఆ తర్వాత చర్చ గురించి ఆలోచిస్తామని చెప్పారు; కానీ మాకు అది ఇష్టం లేదు. మేం నిన్న నోటీసు ఇచ్చాం, ఈ రోజు కూడా ఇచ్చాం" అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గాంధీ: 73 ఏళ్ల వయసులో 21 రోజుల నిరాహార దీక్ష: ఇక బతకరని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం
ప్రధాని నివాసం వద్ద ధర్నా: రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఫొటో సోర్స్, Congress/X
దిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద విపక్ష నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, Congress/X
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ.. "ఇది ముగింపు కాదు, రాహుల్ గాంధీ నాయకత్వంలో సరికొత్త విప్లవానికి ఇది ఆరంభం మాత్రమే. వాళ్లు మమ్మల్ని జైల్లో పెట్టవచ్చు, లాఠీఛార్జ్ చేయవచ్చు, లేదా వేధించవచ్చు. కానీ, పేపర్ లీకుల వల్ల భవిష్యత్తును కోల్పోయి, తమ కుటుంబాల ఆశలు ఆవిరైపోయిన భారతదేశంలోని కోట్లాది మంది బిడ్డలకు మోదీ కచ్చితంగా సమాధానం చెప్పాల్సింది" అన్నారు.
